HYD: ఎల్బీ నగర్- హయత్ నగర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన చేశారు. దీనిని కేంద్రం వార్షిక ప్రణాళికలో చేర్చిన వెంటనే డీపీఆర్ సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, విజయవాడకు కేవలం 3 గంటల్లో చేరుకునేలా డబుల్ డెక్కర్ రోడ్డును కూడా మంజూరు చేయించుకున్నామని అన్నారు.