MDK: 765 డీజీ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని మంగళవారం రామాయంపేట మున్సిపల్ భూ నిర్వాసితులు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. గతంలో ఇచ్చిన నోటీసుల ప్రకారం సరైన ధర చెల్లించడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం భూములకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.