W.G: పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ కేవీఆర్ నర్సింహారావు మంగళవారం తెలిపారు. వివిధ రంగాలకు చెందిన 20 కంపెనీల ప్రతినిధులు 2000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేయనున్నారని తెలిపారు. ఏదైనా డిగ్రీ, పీజీ, ఐటీఐ, ఎస్ఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.