TG: రావణుడు ఉన్నాడు కాబట్టే రాముడు పేరు గడించారని CM రేవంత్ రెడ్డి చెప్పారు. ‘తెలంగాణలో విలన్ల వల్లే ప్రజలు నన్ను హీరో చేశారు. ఇంకా ఎనిమిదేళ్లు TGలోనే ఉంటాను. దేశరాజకీయాల్లో పని చేసేది పార్టీ నిర్ణయిస్తుంది. ప్రధాని మోదీ త్రీడీ పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతం ఐక్యం కావాలి. దక్షిణాదికి కేంద్రంలో ప్రాతినిధ్యం లేదు. వెంకయ్యనాయుడిని ఎందుకు రాష్ట్రపతి చేయలేదు’ అని ప్రశ్నించారు.