MLG: రైతు భరోసా మొదటి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినందుకు కృతజ్ఞతగా మంగపేట మండల కేంద్రంలో మంగళవారం CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. మండల అధ్యక్షుడు జయరాంరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు.