MLG: వెంకటాపురం మండలంలో ప్రధాన రహదారులను అక్రమించి నిర్మించిన షాపులను తొలగించాలని గ్రామ పంచాయితీ అధికారులు మంగళవారం షాపు యజమానులకు నోటీసులు జారీ చేశారు. అక్రమ షాపుల వల్ల ట్రాఫిక్ జామ్, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. గడువు ముగిసేలోగా స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.