పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటన దేశ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. కరోనా తరహాలోనే దేశంలో ఇప్పుడున్న పరిస్థితులను ఎదుర్కోవాలని మోదీ పిలుపునిచ్చారు. గల్ఫ్ యుద్ధంతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతోంది. ఈ క్రమంలో మోదీ వ్యాఖ్యలతో పరిస్థితులు మరింత తీవ్రం కాబోతున్నాయని స్పష్టమవుతోంది. దీంతో, కరోనా వంటి కష్టకాలం మళ్లీ రాబోతోందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.