పార్వతీపురంలో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి డీసీసీ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటు ప్రజలకు, అటు నాయకులకు కాంగ్రెస్ పార్టీతోనే భవిష్యత్తు అని అన్నారు. అనంతరం పార్టీలోకి వచ్చిన యువకులకు దిశా నిర్దేశం చేశారు.