MDCL: ఎమ్మెల్యే మల్లారెడ్డి సభలో నిజాలు చెబుతారనుకుంటే పక్కనున్న వారి ప్రభావంతో మళ్లీ అబద్ధాలే మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. BRS హయాంలోనే జవహర్నగర్ డంప్ యార్డుకు అన్నీ చేశామని వారు చెబుతున్నారని, అయితే మల్లారెడ్డి ప్రస్తావించిన సమస్యను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయం చూస్తామన్నారు. కనీసం మూడు కొత్త డంప్ యార్డులను ఏర్పాటు చేస్తామన్నారు.