NRPT: మక్తల్లో 800 మెగావాట్ల సూపర్క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జెన్కో అధికారులు ఇవాళ స్థల పరిశీలన చేపట్టారు. కృష్ణా మండల పరిధిలో పర్యటిస్తూ ప్లాంట్ ఏర్పాటు సాధ్యసాధ్యాలను పరిశీలించారు. 2030 నాటికి స్థానికంగా 6 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పరిశీలిస్తోంది.