SDPT:జాతీయ స్థాయి కథారచన పోటీల్లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించడం గర్వకారణమని ప్రిన్సిపల్ ఆచార్య జి. సునీత హర్షం వ్యక్తం చేశారు. నేటి యాంత్రిక జీవనంలో యువత సృజనాత్మక రంగంలో రాణించడం అభినందనీయమన్నారు. సాహిత్యం ద్వారా మానవీయ విలువలను చాటిచెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.