NZB: నగరంలోని బోర్గాం శాఖ గ్రంథాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించి గ్రంథాలయ నిర్వహణను పరిశీలించారు. నూతన భవనం నిర్మించడానికి స్థలం గురించి అధికారులతో చర్చించారు. గ్రంథాలయ నిర్వహణ, సౌకర్యాలపై పాఠకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.