TG: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని సూచించింది. రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోందని ప్రకటించింది. ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వదంతుల వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లు పెరిగాయని పేర్కొంది.