AP: కొత్త పార్లమెంటు భవనంలో వైసీపీకి 11వ నెంబర్ రూమ్‌ను స్పీకర్ కార్యాలయం కేటాయించింది. దీనిపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పీకర్ ఓంబిర్లాను కలిసి 11వ నెంబర్ రూమ్‌ను వెంటనే మార్చాలని వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. 11వ నెంబర్ రూమ్ ఎందుకు మార్చాలో వివరణ ఇచ్చారు. దీంతో సానుకూలంగా స్పందించిన స్పీకర్ 12వ రూమ్‌ను కేటాయించారు.