KMM: రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యతగా ఈ బడ్జెట్లో వ్యవసాయానికి రూ. 23,179 కోట్లు ప్రతిపాదించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా ద్వారా ఎకరాకు ప్రతి సీజన్‌కు రూ. 6,000 చొప్పున ఏడాదికి రూ.12,000 అందిస్తున్నామన్నారు. సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్‌తో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని నేడు వెల్లడించారు.