NGKL: గ్రామస్థాయి పాలనలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. కొల్లాపూర్ డివిజన్‌కు చెందిన 72 మంది నూతన సర్పంచ్ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా పనిచేస్తేనే శక్తివంతమైన నాయకత్వం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్, అమరేందర్ పాల్గొన్నారు.