TG: అసెంబ్లీలో మహిళలకు వడ్డీ లేని రుణాల అంశంపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. అదేవిధంగా, వ్యవసాయంపై BJP నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం అందడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.