TG: భూభారతి తెచ్చిన తర్వాత సాదాబైనామాలు చేర్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘భూభారతిలో పరిష్కారం కనుగొంటున్నాము. నాలుగు రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేస్తున్నాం. ప్రతి జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేస్తాం. భూమి లేకుండా పాస్‌బుక్‌లతో రైతు భరోసా తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లా సర్వేలో 1200 ఎకరాలు ఉన్నట్లు గుర్తించాం’ అని తెలిపారు.