సముద్రపు జీవి అయిన స్టార్ ఫిష్‌కు మెదడు, గుండె, రక్తం ఉండవు. ఇది రక్తం బదులుగా సముద్రపు నీటిని తన శరీరమంతా పంపిస్తూ పోషకాలను పొందుతుంది. మెదడు లేకపోయినా తన నాడీ వ్యవస్థ ద్వారా పరిసరాలను పసిగడుతూ ఆహారాన్ని వేటాడుతుంది. ప్రకృతి సృష్టించిన ఈ వింత జీవి జీవనశైలి నిజంగా ఆశ్చర్యకరం.