AP: సీఎం చంద్రబాబు విధానంలోకి షర్మిల వెళ్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ‘షర్మిల తన అవసరాల కోసం.. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయొద్దు. చంద్రబాబు చేతిలో రాజకీయ పావుగా మారొద్దు. జగన్ మమ్మల్ని సంయమనం పాటించమన్నారు. ఇకపై హద్దుదాటితే ఊరుకునే పరిస్థితి లేదు’ అంటూ హెచ్చరించారు.