GNTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు మంత్రి లోకేష్‌ను కలిసి తమ సమస్యలను వినిపించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్, వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.