ఆది పినిశెట్టి నటించిన రివెంజ్ డ్రామా ‘శబ్దం’ ఎట్టకేలకు OTTలోకి వచ్చేసింది. అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. హారర్, ఎమోషనల్ అంశాలతో సాగే ఈ చిత్రం తాజాగా జీ5లో కేవలం తమిళ భాషలోనే అందుబాటులో ఉంది. దీంతో తెలుగు ప్రేక్షకులు కాస్త నిరాశకు గురయ్యారు.