MDCL: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి సూర్య నగర్లోని వీవీ స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకోవడానికి వచ్చిన ఇంటర్ చదివే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని అల్వాల్ పోలీసులు వెల్లడించారు.