PPM: పాచిపెంట MPDO కార్యాలయంలో మంగళవారం జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు MPDO బీవీజే పాత్రో సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. సర్పంచుల పదవి కాలం వచ్చే నెల 2తో ముగియనుండటంతో సర్పంచ్లకు ఇదే చివరి సభ అని, వారికి వీడ్కోలు కూడా ఈ సభలో నిర్వహిస్తామన్నారు.