NRML: అటవీ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖలో విశిష్ట సేవలు అందించిన అటవీ అధికారి మహ్మద్ నజీర్ ఖాన్కు ప్రశంసాపత్రం అందజేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సన్మానం చేశారు. అటవీ, వన్యప్రాణి సంరక్షణ, చట్టాల అమలు, చైనా మాంజా నిషేధం వంటి అవగాహన కార్యక్రమాలలో చేసిన కృషికి ఈ అవార్డును వారికి అందజేశారు.