ADB: పోలీసు విధులను ఆటంకపరిచిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. జిల్లాలో ఇటీవల నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు SP వెల్లడించారు.