SKLM: శ్రీకాకుళం మండలం అరసవిల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆయన నామ గోత్రాలను చదివి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి జ్ఞాపకను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో కేఎన్వీడీవీ.ప్రసాద్ పాల్గొన్నారు.