PDPL: బీజేపీ ‘చలో అసెంబ్లీ’ ముట్టడి కార్యక్రమానికి హైదరాబాద్కు బయలుదేరిన జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.