TG: తనకు అన్యాయం చేసిన వారిలో సీఎం రేవంత్ కూడా ఉన్నారని మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వల్ల తన గౌరవానికి భంగం కలిగిందని ఆరోపించారు. తన సమస్యకు సీఎం దగ్గర కూడా పరిష్కారం లేదన్నారు. సాగునీటి కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మేడిగడ్డను రిపేర్ చేసే బాధ్యత లేదా? అని నిలదీశారు.