AP: ప్రధాని మోదీ సాధించిన ఘనతపై మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు. ‘మోదీ నాయకత్వం కోట్లాది భారతీయులకు స్ఫూర్తి. గుజరాత్ సీఎం నుంచి ప్రధానిగా ఆయన ప్రస్థానం దేశ గౌరవాన్ని పెంచింది. జాతి నిర్మాణంలో ఆయన పాలన ఒక చారిత్రక అధ్యాయం’ అని కొనియాడారు. ఈ చారిత్రక సందర్భంగా బీజేపీ, ఎన్డీయే పక్షాలు ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.