VKB: దౌల్తాబాద్ మండల పరిధిలోని ఈర్లపల్లిలో ఉపాధి హామీ (MGNREGA) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ బోయిని పద్మ ప్రారంభించారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల పనులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు.