NGKL: నాగర్కర్నూల్ డిపో నుంచి ఈ నెల 27న ప్రత్యేక గోవా టూర్ ప్రారంభం కానుంది. సూపర్ లగ్జరీ బస్సులో మూడు రోజుల యాత్రకు ఒక్కొక్కరికి రూ.3,500 ప్యాకేజీ నిర్ణయించినట్లు డీఎం యాదయ్య తెలిపారు. ఆసక్తి గల వారు 9490411590, 9490411591 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ తక్కువ ధర ప్యాకేజీని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.