TG: కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపీ పెట్టింది అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజున 6 గ్యారెంటీల దస్త్రంపై సంతకం చేశారని.. ఇప్పుడు ఆ ఫైల్ కనిపించట్లేదని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ ఆరు గ్యారెంటీలపై సంతకం జరిగిందని చెప్పించారన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఆర గ్యారెంటీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదన్నారు.