KRNL: ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రమీల ఆత్మహత్య ఘటనతో విషాదం నెలకొంది. దాడి కారణంగా మనస్తాపానికి గురై ఆమె ఈ నెల 17న ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాల మహానాడు నాయకులు ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.