నటి స్నేహా ఉల్లాల్ గతంలో తనను ఐశ్వర్య రాయ్‌తో పోల్చుతూ వచ్చిన వార్తలపై తాజాగా స్పందిస్తూ ఆసక్తికర విషయం పంచుకుంది. ఐశ్వర్యను కలిసినప్పుడు.. ‘మీడియా నన్ను మీతో పోలుస్తోంది, నన్ను ద్వేషించకండి’ అని క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. తన పోలికలపై వస్తున్న వార్తలతో ఐశ్వర్య ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అలా వివరణ ఇచ్చానని స్నేహా చెప్పుకొచ్చింది.