WNP: తెలంగాణలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శిరసనగండ్ల సీతారామ చంద్రస్వామి దేవస్థానాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు.