మున్సిపాలిటీల అభివృద్ధికి బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించడంతో నారాయణపేట పట్టణ అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు నెలకొన్నాయి. పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈసారి నిధులతో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.