జాతీయ రహదారుల పర్యవేక్షణ కోసం NHAI సరికొత్త AI వ్యవస్థను తీసుకువస్తోంది. ప్రత్యేక డాష్‌క్యామ్ కెమెరాల ద్వారా రోడ్లపై గుంతలు, ఆక్రమణలు, తదితరాలను ఈ టెక్నాలజీ ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. దీనివల్ల మరమ్మతులు వేగంగా జరిగి రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. సుమారు 40 వేల కిలోమీటర్ల మేర ఈ నిఘా వ్యవస్థ ప్రయాణికులకు రక్షణగా నిలవనుంది.