విశాఖలోని ఏయూ 91, 92వ సంయుక్త స్నాతకోత్సవం ఈనెల 25న నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ డాక్టర్ ఎస్. అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే, ఇందులో ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు పాల్గొని గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు.