రవితేజ, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న ‘ఇరుముడి’ చిత్రంలో ఐకానిక్ అయ్యప్ప స్వామి పాట ‘ఎక్కినాడు పల్లకి’ని రీమిక్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ స్పందిస్తూ.. అభిమానుల నుంచి భారీ డిమాండ్ ఉన్న మాట వాస్తవమేనని, అయితే తుది నిర్ణయం దర్శక-నిర్మాతల చేతుల్లోనే ఉందని తెలిపాడు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో కూడిన ఈ మూవీ రాబోతుంది.