ADB: మహారాష్ట్రలోని పౌర దేవి యాత్రకు బయలుదేరిన భక్తుల పాదయాత్ర శనివారం రాత్రి ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా భక్తులకు స్థానిక ఫంక్షన్ హాల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న MLA అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న భక్తులకు స్వయంగా అన్నాన్ని వడ్డించారు. క్షేమంగా పౌర దేవి అమ్మవారిని దర్శించుకోవాలని ఆకాంక్షించారు.