పాన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. కొత్తగా దరఖాస్తు చేసేవారు ఆధార్ కార్డుతోపాటు బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్టు, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పదో తరగతి సర్టిఫికెట్ వంటి పత్రాలలో ఏదైనా ఒకటి జతచేయాలి. ప్రస్తుతం ఉన్న విధానంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేదీ అని సీఎస్సీ స్పష్టం చేసింది.