KNR: శంకరపట్నం (M) అంబాల్పూర్లో గ్రామంలో సీసీ రోడ్లు, పంచాయతీ భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం గ్రామంలో డీఆర్డీవో శ్రీధర్ పలు వీధుల్లో రోడ్ల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించిన నివేదికను కలెక్టర్కు అందించనున్నట్లు డీఆర్డీఓ తెలిపారు.