SKLM: సోంపేట ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి. చిన్నాజీవర్మ తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు అర్హులన్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.