MNCL: చెన్నూరు నియోజకవర్గంలో శనివారం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. రంజాన్‌ను పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని పలు ఈద్గాల వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనలలో ఆయన పాల్గొంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అలాగే స్థానిక మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.