TG: అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. వారి హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఎన్ని ఇళ్లు ఇచ్చారు. రైతు రుణమాఫీ ఒకేసారి ఎందుకు చేయలేదు. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఎందుకు ఇవ్వలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందనే.. మూడేళ్ల వయో పరిమితి పెంచారు’ అని విమర్శించారు.