ATP: జిల్లాలో గత మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు రూ.5 కోట్ల పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు 160 హెక్టార్లలో మొక్కజొన్న, 100 హెక్టార్లలో అరటి తోటలు నేలకొరిగాయి. బుక్కరాయసముద్రం, గార్లదిన్నె సహా పలు మండలాల్లో 400 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు.