TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు. గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచనలను CM రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.