‘ది కేరళ స్టోరీ’ మూవీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ సినిమా కేరళ వాస్తవాలను ప్రతిబింబించడం లేదని పరోక్షంగా విమర్శించారు. ఆ రాష్ట్రపు అసలైన సంస్కృతిని రుచి చూడమని చెప్పారు. కేరళకు చెందిన ప్రసిద్ధ వంటకాలు ‘బీఫ్ ఫ్రై’, కొబ్బరితో చేసిన ‘బీఫ్ కర్రీ’ ఫోటోలను షేర్ చేశారు. ‘అసలైన కేరళ స్టోరీని రుచి చూడండి’ అంటూ తన SM వేదికగా రాసుకొచ్చారు.