»Scientists Who Said Good News Another Planet Similar To Earth
Earth Like Planet: గుడ్న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు..భూమిని పోలిన మరో గ్రహం!
భూమిని పోలిన మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ గ్రహం సూర్యుడికి కాస్త దగ్గర్లో ఉందని, త్వరలోనే ఆ గ్రహానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయనున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
భూమిలాంటి గ్రహాల (Earth Like Planet) కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. భూమిలాంటి గ్రహాల కోసం ఖగోళశాస్త్రం, గ్రహశాస్త్రం తమ అన్వేషణను కొనసాగిస్తున్నాయి. సైంటిస్టులు అలాంటి గ్రహాలను కనిపెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ పరిశోధనలు సాగిస్తున్నారు. సౌర వ్యవస్థలో భూమిని పోలిన గ్రహం సూర్యుని చుట్టూ ఉండే నెప్ట్యూన్కు పైన ఉండే కక్ష్యలో ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో శాస్త్రవేత్తల (scientists) ప్రయత్నం ఫలించినట్లు సమాచారం.
పరిశోధకులు తెలిపిన ప్రకారం..కైపర్ బెల్ట్ (Kuiper belt)లో భూమిలాంటి గ్రహం దాగి ఉందని కనుగొన్నారు. జపాన్ లోని ఒసాకాలోని కిందాయ్ యూనివర్సిటీకి చెందిన పాట్రిక్ సోఫియో లైకావ్కా, టోక్యోలోని తకాషి ఇటో వర్సిటీలు పరిశోధనలు చేపట్టాయి. ఈ ఫలితాల్లో అసలు విషయం తెలిసింది. భూమిని పోలిన గ్రహం ఉనికిని తాము గుర్తించినట్లుగా పరిశోధకులు తెలిపారు. ఈ విషయం గురించి ఆస్ట్రోనామికల్ జర్నల్లో పూర్తి నివేదికను ప్రచురించారు.
ఆ గ్రహం కైపర్ బెల్ట్ ప్లానెట్ (Kuiper belt)లాగే ఉందని పరిశోధకులు కనుగొన్నారు. సౌర వ్యవస్థలో అనేక వస్తువులు ఉన్నాయని, భూమిని పోలిన గ్రహం కూడా సూర్యుడి నుంచి 250 లేదా 500 ఖగోళ యూనిట్ల మధ్య ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు (scientists) వెల్లడించారు. తాము ఆ గ్రహం ఉనికిని పూర్తిగా కనుగొనేందుకు అనేక అడ్డంకులు కూడా ఉన్నాయన్నారు. కైపర్ బెల్ట్ సమీపంలోని భూమిని పోలిన మరో గ్రహ నిర్మాణం, దాని పరిణామ ప్రక్రియలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.